శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట లో వర్షాలకు పలు ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో వర్షానికి కురిసిన నీరు రహదారులపై నిలిచిపోయింది. బజార్ వీధి, బస్టాండ్ వీధి, రైల్వే స్టేషన్ ఆవరణలోని జీపు స్టాండ్ లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచింది. శ్రీవారి యాత్రికులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.