జిల్లాలో సాధారణ సాగు 7557 హెక్టర్లు వుందని, అందులో వరి 4062 హెక్టార్ల విస్తర్ణంలో ఉండగా స్థానిక అమ్మకాలు పోను 879. 7 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశముందని జిల్లా కలెక్టర్ ఎం. హరినారయణన్ అన్నారు. సోమవారం వరి కొనుగోలుకు సంబంధించి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, అరుణ్ కుమార్, సివిల్ సప్లై వి సి మరియు ఎం డి వీరపాండ్యన్ లు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7557. 7 హెక్టార్లలో సాగు వుండగా వరి 4062. 8 హెక్టార్లలో వరి సాగు జరిగిందని ఒక్కో హెక్టా రుకు 4. 6 టన్నులు ఉత్పత్తి అవుతుందని , మొత్తం 18716 మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తి అవుతుందని, స్థానిక అవసరాలకు 11005 వెళుతుందని, మార్కెట్ కి 7711. 5 టన్నులు మార్కెట్ కి వస్తుందని అందులో ఓపెన్ మార్కెట్ లో 5390 టన్నులు అమ్మకాలు జరుగుతాయని, స్థానిక మిల్లర్లు 1442 టన్నులు కొనుగోలు చేస్తారని సివిల్ సప్లై ద్వారా సుమారు 880 టన్నులు కొనుగోలు చేయవచ్చునని తెలిపారు.