మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న ఫుట్ బాల్ క్రీడాకారిణి మృతి చెందిన ఘటన చెన్నైలో జరిగింది. ప్రియ అనే ఫుట్ బాల్ క్రీడాకారిణి పెరియార్ లోని ప్రభుత్వాస్పత్రిలో మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోగా,ఆమె ఆరోగ్యం విషమించి మృతిచెందింది.యువతి బంధువులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రియ మృతి చెందిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.