ప్రపంచ జనాభా నేటితో 800 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 12 ఏళ్లలో 700 కోట్ల నుంచి 800 కోట్లకు చేరి అరుదైన మైలురాయిని అందుకుందని పేర్కొంది. 2030 నాటికి 850 కోట్లకు, 2050 కల్లా 1040 కోట్లకు చేరనుందని ఐరాస అంచనా వేసింది. భారత్.. 2023 నాటికి చైనాను అధిగమించి అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనుందని తెలిపింది.