విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడంతో తండ్రీకొడుకులకు కడుపుమంట ఎక్కువైంది అని వైసీపీ నాయకులూ విజయ్ సాయి రెడ్డి వాపోయారు. ముఖ్యమంత్రి ప్రసంగం విన్నాక టీడీపీ నేతలు బుర్రలు చెడిపోయినట్టయింది. తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ తమ ఏడుపును పాలకపక్షమైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విద్వేషంగా, ఆక్రోశంగా మార్చుకున్నారు. నిరాధార ఆరోపణలతో వికృత విషప్రచారానికి తెగబడుతున్నారు. విశాఖపట్నం రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని అవుతుందని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి గుండెకాయగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు పూనకం వచ్చిన రక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న పాలకపక్షం సీనియర్ నేతలపై నోరు పారేసుకుంటున్నారు. తమ అసభ్య దుష్ప్రచారానికి పరిమితులు లేవన్నట్టు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉండి రాజకీయ బరువుబాధ్యతలు మోస్తున్న నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.