మంగళగిరి నగరంలోని లోని టిడ్కో గృహ సముదాయాల్లోని ప్రతి ఇంటికి ముందుగా విద్యుత్ మీటర్లు బిగించాలని ఎమ్మెల్యే ఆర్కే అధికారులకు సూచించారు. లబ్ధిదారులు గృహప్రవేశం చేసిన అనంతరం రూ. 650 రూపాయలు చెల్లిస్తారని ఒకవేళ ఏదైనా కారణాలతో లబ్ధిదారులు చెల్లించకపోతే తానే లబ్ధిదారులు తరఫున నగదు చెల్లిస్తానని విద్యుత్ శాఖ అధికారుల తో ఒప్పందం చేసుకున్నారు. లబ్ధిదారులకు గృహప్రవేశాల సమయంలో ఇబ్బంది కలక్కూడదని ఎమ్మెల్యే ఆర్కే చొరవ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.