పన్ను చెల్లింపుదారులకు చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. అవగాహన పెంచడం, వారి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందించినట్టు అవుతుందన్నారు. బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్ రూమ్‌లు రద్దు వంటి ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. ఆదాయాలను ఇచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.