ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాహు-కేతువుల్లా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తయారయ్యారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. రైతు కోసం ఎంతో చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి టీడీపీ - ఎల్లో మీడియా పనిగట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వీరికి పవన్ కల్యాణ్ వంతపాడుతూ, వారికి తానాతందానా అంటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు-పవన్ కల్యాణ్ లు రాష్ట్రానికి రాహు-కేతువుల్లా తయారై, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని కాకాణి మండిపడ్డారు.