గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినా కాళ్లలో వాపు వస్తుంది. కాళ్లవాపు కనిపించగానే గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లాలి. కొద్దిసేపు అటు ఇటూ తిరగాలి. పడుకొని పాదాల కింద దిండు పెట్టుకొని విశ్రాంతి తీసుకోవాలి. చల్లగా ఉన్న ప్రాంతంలో ఉండాలి. తేలికపాటి వ్యాయామం, యోగా చేయాలి. వైద్యులు సూచించిన సాక్స్‌లు వేసుకోవాలి. బీపీ, మధుమేహం టెస్టులు చేయించుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ఉప్పు, చక్కెర తగ్గించాలి.