సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ లోకానికి తీరని లోటని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. సినీ వృత్తి పట్ల ఆయనకు అసమాన గౌరవం, క్రమశిక్షణ ఉండేదని పేర్కొన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశారు.