అమెరికా రవాణాశాఖ ఎయిర్ ఇండియా సహా పలు ఎయిర్ లైన్స్ కంపెనీలకు జరిమానాలు విధిస్తూ, టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు చార్జీలను చెల్లించాలని ఆదేశించింది.మొత్తం ఆరు ఎయిర్ లైన్స్ 7.25 మిలియన్ డాలర్లు జరిమానా, 622 మిలియన్ డాలర్లు ప్రయాణికులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కరోనా సమయంలో విమానాలు రద్దు కావడం, ఆలస్యం కావడం జరగగా, ఇప్పటికీ రిఫండ్ ఇవ్వలేదు. ఎయిర్ ఇండియా 121.5 మిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాల్సి ఉంది.