కొవిడ్ విజృంభణతో కొన్ని రకాల వ్యాధుల నిర్ధారణకు తీవ్ర ఆటంకం కలిగించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కేవలం 2020లోనే భారత్ లో సుమారు 5 లక్షల మంది క్షయ వ్యాధి పరీక్షకు దూరం కాగా.. నిర్ధారణ ఆలస్యమైనట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. 45 దేశాల్లో 15 లక్షల మంది వ్యాధి నిర్ధారణకు దూరమైనట్లు బీఎంసీ మెడికల్ జర్నల్ ప్రచురించిన నివేదికలో పేర్కొంది. ఈ పరిస్థితి ఆందోళనకరమేనని పరిశోధకులు చెబుతున్నారు.