దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ఆస్పత్రి ఎయిమ్స్‌లో దారుణమైన ఘటన జరిగింది. రోగులకు అందించే ఆహారంలో బొద్దింకలు వచ్చాయి. ఆపరేషన్ చేయించుకున్న ఓ చిన్నారికి ఇవాళ పప్పు, అన్నంతో కూడిన ఆహారాన్ని అందించారు. అన్నం తినిపించే సమయంలో అందులో బొద్దింక కనిపించింది. దీంతో తల్లిందండ్రలు షాక్‌కు గురయ్యారు. ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.