మహారాష్ట్రకు చెందిన దీపికా పాటిల్ గోప్‌నారాయణ్ నిండు గర్భిణీగా ఉండి కూడా మొండి ధైర్యంతో క్యాన్సర్ ను జయించింది. వివాహం జరిగిన ఐదేళ్లకు గర్భం దాల్చిందని సంతోషించేలోపే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసింది. కానీ అధైర్యపడకుండా కీమో, రేడియోథెరపీ చికిత్సలకు హాజరైంది. డెలివరీ సమయంలో కోవిడ్ సోకినా సరే, సిజేరియన్ వద్దని, 40 గంటలపాటు ప్రసవ వేదనను భరించి తన కొడుకు స్వరాజ్ కు జన్మనిచ్చింది.