భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు సరదాగా ఉంటాయి. ఈ కోవలో వృద్ధ దంపతుల డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వృద్ధుడు ట్రైన్లో మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్స్ చేసేందుకు తన భార్యను పిలిచాడు. ఆమె నిరాకరించడంతో మరో మహిళతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఇది గమనించిన ఆ వృద్ధురాలు ట్రైన్లోనే మరో వ్యక్తితో కలిసి పోటీగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను goodnews_movement అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వయసు ఒక సంఖ్య అనే విషయాన్ని వారు నిరూపించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.