బిహార్లోని అలీషేర్పూర్లో ముక్కులేకుండా ఓ ఆడ శిశువు జన్మించింది. ఆ శిశువుకు ముక్కు ఉండాల్సిన స్థానంలో వింత ఆకారంలో కళ్లు ఉన్నాయి. శ్వాస తీసుకోవడానికి రంధ్రాలు లేవు. దీంతో ఈ వింత శిశువును గ్రహాంతర వాసి అంటూ ప్రచారం చేస్తున్నారు. సరోజ పటేల్, రూపాదేవి దంపతులకు ఆ శిశువు జన్మించింది. ఆ శిశువుకు నోట్లో ఆక్సిజన్ పైపు పెట్టి చికిత్స అందిస్తున్నారు. జన్యుపరమైన లోపాల కారణంగా ఇలాంటి శిశువులు జన్మిస్తారని వైద్యులు అంటున్నారు.