తనతో వాదనకు దిగిన ప్రముఖ ఇంజినీర్ పై ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ వేటు వేశారు. ఆదివారం పలు దేశాల్లో ట్విటర్ సేవలు నెమ్మదించడంపై క్షమాపణలు చెబుతూ మస్క్ ట్వీట్ చేస్తూ యాప్ పని తీరు సరిగ్గా లేదని వివరించారు. దీనిపై ఇంజినీర్ ఎరిక్ రీట్వీట్ చేశారు. తాను ఆండ్రాయిడ్ కోసం ట్విట్టర్ లో ఆరేళ్లుగా పని చేస్తున్నానని.. నిందలు వేయడం సరి కాదని పేర్కొనగా.. ఇద్దరి మధ్య గొడవ నడిచింది. ఈ క్రమంలో ఎరిక్ ను తొలిగించినట్లు మస్క్ ప్రకటించారు.