ఏపీలోని 10 మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన గడువును పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 మే 5 లేదా ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజమహేంద్రవరం కార్పొరేషన్ సహా రాజాం, భీమవరం, పాలకొల్లు, తణుకు, గుడివాడ, తాడేపల్లిగూడెం, బాపట్ల, శ్రీకాళహస్తి, గూడూరు మున్సిపాలిటీల ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa