టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని భారత క్రికెట్ డైరెక్టర్ గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. హెడ్ కోచ్ ద్రవిడ్ టెస్టులు, వన్ డే ఫార్మాట్లపై, ధోనీ టీ20లపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఈ నెలాఖరులో జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ లో ఈ అంశం గురించి చర్చించనున్నట్లు టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. ద్వైపాక్షిక సిరీసుల్లో అద్భుతంగా రాణిస్తోన్న భారత్.. ప్రపంచ కప్ నకు వచ్చే సరికి బోల్తా పడుతోంది.