రోడ్డు విస్తరణ పేరుతో కడప నగరంలో అధికారులు నిరుపేదల గృహాలను కూల్చడం దారుణమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి అన్నారు. గురువారం రోడ్డు విస్తరణ పేరుతో కడప నగరంలోని మసాపేటలో ఇళ్ళు కోల్పోయిన వారిని తులసిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ తులసి రెడ్డి మాట్లాడుతూ దళితుల ఇళ్లపై కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యం నశించాలి అన్నారు. మాసాపేటలో ఇళ్ళు కోల్పోయిన వారందరికి ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని అన్నారు. జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డెలిగేట్ బొజ్జా తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.