690 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసి రూ.640 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అరుణాచల్ ప్రదేశ్‌లోని మొదటి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ డోనీ పోలోను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో 600 మెగావాట్ల కమెంగ్ జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ కమెంగ్ జిల్లాలో 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 8,450 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్‌ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుస్తుంది, జాతీయ గ్రిడ్‌కు స్థిరత్వం మరియు ఏకీకరణ పరంగా కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.