తెలంగాణ ప్రభుత్వాన్నే కాకుండా పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని కూడా నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెలంగాణ రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని, తెలంగాణ రాజకీయ పరిస్థితుల కోణంలో సీఎం కేసీఆర్ మాట్లాడి ఉంటారని సజ్జల తెలిపారు. వారి ఉచ్చులో పడబోమని సజ్జల స్పష్టం చేశారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి అజెండాతో పనిచేస్తోందని, ఇతర రాష్ట్రాల వ్యవహారాలను పట్టించుకోవడం లేదని సజ్జల తేల్చి చెప్పారు.