టీ20ల్లో టీమిండియా తలరాత మారాలంటే కొత్త కెప్టెన్ ను నియమించాలని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మను సారథ్యం నుండి తప్పించాలని పరోక్షంగా అన్నారు. యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఇవ్వాలన్నారు. టీ20లకు మరో కెప్టెన్ ను నియమిస్తే మంచిదని, దీని వల్ల జట్టుకు ఎలాంటి నష్టం జరగబోదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఆటగాడు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉండడం సాధ్యంకాదని అభిప్రాయపడ్డారు.