నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే జాతీయ ప్రధాన కార్య దర్శి సిహెచ్. శంకర్రావు డిమాండ్ చేశారు. గురువారం గుత్తిలోని ఆర్ఎస్ కాలనీలో ఆయన పర్యటిం చారు. పత్తికొండ రోడ్డు కూడలిలో ఉన్న పూలే విగ్రహానికి ఆయన పూల మాలేసి ఘన నివాళులు అర్పించా రు. అక్కడి నుంచి బైక్ ర్యాలీ అంబే ద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం యూనియన్ కార్యాలయం, లోకో డీజిల్ షెడ్ ను ఆయన సందర్శిం చారు. కార్మికులతో మాట్లాడి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు చేస్తా మని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూని యన్ డివిజన్ కార్యదర్శి విజయ్ కుమార్, సహాయ కార్యదర్శిలు మస్తాన్ వలి, మహ్మద్ గౌస్, నాయ కులు నారాయణ, కోశాధికారి శర్మ, కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ రమేష్, గుత్తి బ్రాంచ్ కార్యదర్శులు రామాం జుల రెడ్డి, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.