స్విగ్గీ ఫుడ్ డెలివరీ సర్వీస్ గురించి తెలియని వారుండరు. ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే స్విగ్గీకి చెందిన డెలివరీ బాయ్ ఆహారం మన దగ్గరకే తెచ్చిస్తారు. కాగా, తమకు వేతనాలను పెంచాలంటూ కొచ్చిలోని స్వీగ్గీ కార్యాలయం ముందు డెలివరీ బాయ్స్ నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో దాదాపు 5000 మంది స్విగ్గీ డెలివరీ బాయ్స్ పాల్గొంటున్నారు. దీంతో కొచ్చి నగరవ్యాప్తంగా ఫుడ్ డెలివరీలకు అంతరాయం ఏర్పడింది.