జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే మలబద్దకం సమస్య వస్తుంది. జంక్ ఫుడ్ తినకుండా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తింటే జీర్ణక్రియ ఈజీ అవుతుంది. రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే పెద్దపేగు గోడల్లో కదలికలు సులభమై మలాన్ని బయటకు పంపిస్తాయి. రోజుకు కనీసం 4లీటర్ల నీరు తాగితే ఆహారం జీర్ణమై మలబద్ధకం పోతుంది. నిత్యం శారీరక వ్యాయామం చేయడం అవసరం. తిన్న తర్వాత అటు ఇటు నడిస్తే ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది.