ఇస్రో చరిత్రలో తొలిసారి ఓ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ రాకెట్ ను శుక్రవారం ప్రయోగించారు. ఈ రాకెట్ ను హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించింది. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందించిన మొదటి రాకెట్ ఇదే కావడం విశేషం.