ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేట్‌ రాకెట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 01:53 PM



భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది.






శుక్రవారం ఉదయం 11.30 గంటలకు షార్‌లోని సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్స్‌ నుంచి తొలి ప్రైవేటు రాకెట్‌ 'విక్రమ్‌-ఎస్‌' నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.


హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ.. విక్రమ్‌-సబ్‌ ఆర్బిటల్‌ (వీకేఎస్‌) ఈ ప్రైవేట్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఈ మొట్టమొదటి మిషన్‌కు 'ప్రారంభ్‌' అని నామకరణం చేశారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ హాజరయ్యారు. వాస్తవానికి ఈనెల 12నే ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌.. సింగిల్‌ స్టేజ్‌ సబ్‌-ఆర్బిటల్‌ లాంచ్‌ వెహికల్‌ కావడం ప్రత్యేకత. ఈ రాకెట్‌ మూడు పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com