యావత్ దేశాన్నే కదిలించిన దివి సీమ ఉప్పెనకు విషాదానికి నేటికి సరిగ్గా 45 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఏపీలో 1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రంలో తుపానుతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి ప్రకోపానికి 10 వేల మందికి పైగా మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేల మంది నిరాశ్రయులు కాగా.. గుట్టలుగా శవాలు పేరుకుపోయాయి. అప్పట్లోనే సుమారు రూ.172 కోట్ల నష్టం వాటిల్లింది.