యూకేలో భారత్ కు చెందిన 13 ఏళ్ల బాలిక మౌలికా పాండే ప్రతిభ చూపింది. ఉత్తరాఖండ్ కు చెందిన ఈమె ప్రపంచ ప్రఖ్యాత ‘క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్’లో ‘ది మొలాయి ఫారెస్ట్’ శీర్షికతో కథ రాసి జూనియర్ విభాగంలో రన్నరప్ గా నిలిచింది. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన పద్మశ్రీ జాదవ్ మొలాయి పాయెంగ్ యథార్థ జీవిత గాథను తన రచనా కౌశలంతో కళ్లకు కట్టింది. బకింగ్ హామ్ ప్యాలెస్ లో గురువారం జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాణి కెమిల్లా నుంచి పురస్కారాన్ని అందుకుంది.