సీఎం జగన్ రైతు బాంధవుడని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఏఎంసీ కార్యాలయ ఆవరణలో ఆయన చీరాల నియోజకవర్గం లోని ఉద్యానవన రైతులకు ప్రభుత్వం అందజేసిన డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ పరికరాలను పంపిణీ చేశారు.
ఏడాది పొడవునా పండించేందుకు వీలైన ఉద్యానవన పంటల సాగులో రైతులకు ఉండేందుకు అతి ఖరీదైన పరికరాలను ప్రభుత్వం సమపుచ్చటం ఎంతైనా ముదావహమన్నారు. రైతులు ఈ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారిణి సుమతి, ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.