పెళ్లి చేసుకుంటానని నమ్మించి, 23 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యాపారవేత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఛత్తీస్ గఢ్ రాయ్ ఘర్ జిల్లా కాళింది కుంజ్ కాలనీ నివాసి మనోజ్ అగర్వాల్, బాధిత యువతి సహజీవనం చేశారు. మనోజ్ తనతో శారీరక సంబంధం పెట్టుకొని రెండు సార్లు అబార్షన్ చేయించాడని, తనను పెళ్లిచేసుకోకుండా వేరే యువతిని పెళ్లిచేసుకున్నట్లు యువతి తెలిపింది. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.