దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేలా ‘ఇద్దరు పిల్లల’ విధానాన్ని తప్పనిసరి చేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వ పరిధిలోని అంశమని జస్టిస్ ఎస్ఎ కౌశల్, జస్టిస్ ఎఎస్ ఓకాల ధర్మాసనం వెల్లడించింది. జనాభా పెరుగుదల ఏదో ఒక మంచి రోజున ఆగిపోయే వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. అడ్వకేట్ అశ్వినీకుమార్ ‘ఇద్దరు పిల్లల’ అమలు విధానంపై వేసిన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్డు తోసిపుచ్చగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.