చెత్తను వీధుల్లో వేయకుండా చెత్త ఆటోలు ఇళ్ల వద్దకు వచ్చినపుడు పారిశుద్ధ్య సిబ్బందికి అందించి స్వచ్ఛ గుంతకల్లుకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రజలకు సూచించారు. శనివారం గుంతకల్లు పట్టణంలోని 22, 30 వ వార్డులలో మెయిన్ రోడ్డు, ఆచారమ్మ కొట్టాల ఏరియా లలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులను పరిశీలించారు. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రధాన మురికి కాలువ పనులు, రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఆయన తోపాటు శానిటరి ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, సచివాలయ కార్యదర్శిలు ఉన్నారు.