మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో డీఈవో ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ‘ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం’ సందర్భంగా ‘క్లీన్ టాయిలెట్ క్యాంపెయిన్’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ‘సెల్ఫీ విత్ టాయిలెట్’ పోటీలో పాల్గొని వారి ‘డ్రీమ్ టాయిలెట్’ స్కెచ్ రూపొందించాలని ఆదేశించారు. దీనిపై టీచర్లు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో సెల్ఫీలు దిగాలని చెప్పకుండా పరిశుభ్రమైన టాయిలెట్లు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.