చేతిలో కేస్ ఫైల్ లేకుండా వచ్చిన ఓ న్యాయవాదికి సీజేఐ డీవై చంద్రచూడ్ చురకలంటించారు. ‘మీరు గౌను, బ్యాండు ధరించి వచ్చారు. చేతిలో కేస్ పేపర్లు లేవు. కేస్ ఫైల్ లేని న్యాయవాది బ్యాటు లేని సచిన్ టెండూల్కర్ లా ఉంటారు. ఇదేం బాగోదు. ఎప్పుడూ కేసు పత్రాలు మీ చెంత ఉండాలి’ అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయవాది కేస్ ఫైల్ లేకుండా వచ్చిన వైనాన్ని గుర్తించిన ధర్మాసనం ఆ వైఖరిని ఆక్షేపించింది.