టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం శనివారం ఇక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. భవిష్యత్ కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నియోజకవర్గాల ఇన్‌చార్జులు, సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ‘రాష్ట్రానికి ఏమిటీ ఖర్మ’ కార్యక్రమాన్ని ఈ సమావేశంలో చంద్రబాబు ప్రారంభించనున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళే నిమిత్తం ఆ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా, టీడీపీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ మొదటిసారి ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa