చంద్రబాబును భగవంతుడైన శ్రీరాముడితో పోల్చుతూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు రావణుడ్ని తాను ఒక్కడే వధించే సత్తా శ్రీరాముడికి లేకనా...? లోక కల్యాణం కోసం శ్రీరాముడు నాడు అందరి సాయం కోరాడు... ఇప్పుడు చంద్రబాబు కూడా రాష్ట్ర కల్యాణం కోసం అలాంటి నిర్ణయమే తీసుకోవాలంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నరసింహారావు మండిపడ్డారు. ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? అని ప్రశ్నించారు. మీ నాయకుడి ఆరాటం 'లోక' కల్యాణం కోసం కాదు 'లోకేశ్' కల్యాణార్థం అని అందరికీ తెలుసు అని జీవీఎల్ విమర్శించారు.