పెళ్లిళ్లు పెట్టాకులవుతున్న ఈ రోజుల్లో కొన్ని పెళ్లిలు మండపాలలోనే పెట్టాలకు దారి తీస్తున్నాయి. తాజాగా బీహార్ రాష్ట్రంలో అలాంటి ఘటనే చోటు చేసుకొొంది. బీహార్‌లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. తూర్పు చంపారణ్ జిల్లా మోతిహరిలో అంగరంగ వైభవంగా ఒక పెళ్లి జరిగింది. నవంబర్ 16న ఘనంగా వివాహం జరిగింది. బాజా భజంత్రీలు, బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా వివాహం జరిగింది. అయితే అప్పగింతల సమయంలో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. పెళ్లి తంతులో భాగంగా అప్పగింతలు జరుగుతున్న టైంలో అత్తమామలు చేసిన డిమాండ్‌కు అల్లుడు రివర్స్‌లో షాకిచ్చాడు.
తమ కూతురికి అత్తవారింట్లో ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని పేపర్ మీద రాసి హామీ ఇవ్వాలని వధువు తల్లిదండ్రులు కోరారు. దాంతో వరుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వెంటనే రాసిస్తామని కానీ తమకు కూడా ఓ డిమాండ్ ఉందని వారికి చెప్పాడు. వరుడి పెట్టిన నిబంధన విని అందరూ నిర్ఘాంతపోయారు. పెళ్లికూతురు కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేశాడు.
దాంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. దాంతో వధువు తల్లిదండ్రులకు మండిపోయింది. దాంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి... అక్కడ పెద్ద గొడవ అయింది. పెళ్లికొడుకు మద్యం సేవించి వచ్చాడని వధువు తరఫు వారు ఆరోపణలు చేశారు. దాంతో ఘర్షణ పెరిగింది. ఈ క్రమంలో వధువు కుటుంబీకులు.. వరుడి బంధువులను బంధించారు. ఆమె తండ్రి, ఇద్దరు అన్నదమ్ములు, ఆమె డ్రైవర్‌తో పాటు మూడు వాహనాలను బంధీలుగా చేసుకున్నారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకోవడంతో రెండు రోజుల తర్వాత వారిని విడుదల చేశారు. అంతేకాదు వధువు కూడా పెళ్లి కొడుకుతో అత్తవారింటికి వెళ్లలేదు.