అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్. ఐ శ్రీనివాసులు ప్రజలను కోరారు. ఆయన మండలంలోని కల్లుకుంట, బందేపల్లి, బండ్లపల్లి, రాయలచెరువు, కానుగమాకులపల్లి గ్రామాల్లో తన సిబ్బందితో కలిసి కార్డన్ సర్చ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లోనా సోదాలు నిర్వహిం చారు. అనంతరం ప్రజలతో సమావేశమై మాట్లాడారు. కర్ణాటక మద్యం విక్రయించడం, పేకాట, జూదాలు ఆడటం, గొడవలకు వెళ్లడం, గుట్కాలు అమ్మడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. నేర ప్రవృత్తుకి దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలన్నారు.