ప్రపంచ రోడ్డు ప్రమాద మృతుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం పర్చూరు నియోజకవర్గ పరిధిలోని కారంచేడు చిన్నగంజాం ఎస్సైలు అనిత, అనూక్ రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. డ్రైవర్లు, రోడ్డు ప్రమాద మృతుల కుటుంబీకులను వారు సమావేశపరిచి మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయని, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల కు తావు ఉండదని చెప్పారు. ప్రతి ఒక్క డ్రైవర్ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, మద్యo సేవించి వాహనాలు నడపరాదని వారు చెప్పారు. అలాగే ద్విచక్ర వాహన దారులు వేగం నియంత్రించుకొని హెల్మెట్లు పెట్టుకోవాలని ఎస్సైలు అనిత, అనూక్ సూచించారు