కెనడాలో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. భారత్‌కు చెందిన ప్లాంట్ ఫిజియాలజిస్టు ప్రొఫెసర్ హెచ్ డీప్ సైని, కెనడాలోని ప్రాఖ్యాత ఎమ్‌సీ గిల్ యూనివర్సిటికి ప్రిన్సిపల్, వైస్ ఛాన్స్‌లర్‌గా నియామకమయ్యారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న సైని బాధ్యతలు స్వీకరించనున్నట్టు యూనివర్సిటీ తెలిపింది. కాగా ఈ యూనివర్సిటీలో దాదాపు 10వేల మంది విదేశీ విద్యార్థులు చదువుతుండగా అందులో 27శాతం భారతీయులే.