వచ్చే కేంద్ర బడ్జెట్‌లో కావాల్సిన రాయితీలు, తాయిలాల కోసం వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు అప్పుడే తమ విన్నపాల చిట్టా ప్రారంభించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనైనా వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులపై కనికరం చూపాలని భారత పరిశ్రమల సమాఖ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. దీని వల్ల వ్యక్తుల చేతుల్లో కొంత డబ్బు మిగులుతుందని, అది కొనుగోళ్ల రూపంలో తిరిగి వ్యవస్థలోకి చేరుతుందని సీఐఐ పేర్కొంది.