వెక్కిళ్లు రావడం సహజమే. సాధారణంగా ఇవి కొంత సమయం ఉండి, తర్వాత అవే తగ్గిపోతాయి. కానీ కొందరిలో వెంటనే తగ్గకుండా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఇలాంటప్పుడు ఒక గ్లాస్ నీటిలో చెంచా యాలకుల పొడి వేసి మరిగించి, ఆ నీటిని చల్లార్చి తాగితే వెక్కిళ్లు తగ్గుతాయి. టీ స్పూన్ చక్కెర నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరించినా వెక్కిళ్లు తగ్గుతాయి. అల్లం ముక్కను నమిలి తింటే, అల్లంలోని ఔషధ గుణాల వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి.