కేంద్ర ప్రభుత్వం పొడిగించిన ఏడో విడత ఉచిత బియ్యం పంపిణీ ఎట్టకేలకు ప్రారంభమైంది. కానీ స్టాకు మాత్రం చౌక దుకాణాలకు పూర్తి స్థాయిలో చేరలేదు. స్టేజీ-1తో పాటు మండల స్థాయిలో స్టేజీ-2 కేంద్రాల్లో బియ్యం నిల్వలు నిండుకున్నాయి. దీనికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలోని చౌకదుకాణాలకూ ఉచిత బియ్యం సరఫరా అదే స్థాయిలో ఉంది. అయితే ఈనెలాఖరు వరకూ రోడ్డు రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అధికారులు చెబుతున్నా పంపిణీకి కూడా అదే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కార్డుదారులకు సకాలంలో బియ్యం పంపిణీ ఎలా సాధ్యమన్నదే ప్రశ్నగా మిగులుతోంది.