వాట్సాప్ రోజుకో కొత్త ఫ్యూచర్ తెస్తూ తన యూజర్లను ఆకట్టుకొంటోంది. తాజాగా మరో అద్భుత ఫ్యూచర్ ను తీసుకొచ్చింది. మన వాట్సాప్ ను మరొకరు చూస్తే ఎలా? గోప్యతకు భంగం కలుగుతుంది కదా? త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. అది కూడా డెస్క్ టాప్ యూజర్లకే. త్వరలో డెస్క్ టాప్ (కంప్యూటర్లు)పై వాట్సాప్ యాప్ ఓపెన్ అవ్వాలంటే పాస్ వర్డ్ ఇవ్వడం తప్పనిసరి. యూజర్ వాట్సాప్ డెస్క్ టాప్ అప్లికేషన్ ను తెరిచిన ప్రతిసారీ పాస్ వర్డ్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది. దీనివల్ల ఒక అంచె అదనపు రక్షణ ఉంటుంది. ఒకరి వాట్సాప్ సంభాషణలను మరొకరు చూసే ప్రమాదం తప్పిపోతుంది.
ఈ ఫీచర్ పై వాట్సాప్ ప్రస్తుతం పనిచేస్తోంది. దీనివల్ల ఒకరి కంప్యూటర్ మరొకరు తెరిచినప్పుడు వాట్సాప్ ను చూడలేరు. ఇప్పటి వరకు డెస్క్ టాప్ పై వాట్సాప్ లో ఒక్కసారి లాగిన్ అయితే చాలు. ప్రతిసారి పాస్ వర్డ్ ఇవ్వక్కర్లేదు. దానంతట అదే తెరుచుకుంటుంది. దీనిపై యూజర్లు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. దీంతో వాట్సాప్ ఇన్నాళ్లకు లాక్ ఫీచర్ తీసుకొస్తోంది.