ఈ నెల 23న చేపట్టబోయే సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపు ఇచ్చారు. సీఎం రాక దృష్ట్యా నరసన్నపేటలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాను సారం ఎక్కువ గ్రామాలలో రెవెన్యూ సర్వే పూర్తి అయిన నియోజకవర్గం నరసన్నపేటేనని అందుకే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామని అన్నారు. కృష్ణ దాసు నేతృత్వాన ఆయన రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న సమయంలోనే భూ సర్వే ను వీలున్నంత వరకూ వేగవంతం చేయించారన్నారు. సీఎం కార్యక్రమం అన్నది ల్యాండ్ టైటిల్ కు సంబంధించినది కనుక భూ సర్వే ప్రాధాన్యం, తదితర విషయాలపై సీఎం మాట్లాడతారు. పన్నెండు వేల మందితో రైతులతో ఈ సభను నిర్వహించాలని ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి బస్సు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు స్థానిక నాయకులకు బాధ్యత అప్పగించాలి. మొత్తం ప్రొగ్రాం గంటన్నరలో అయిపోతుంది కనుక రైతులు అంతా ఇక్కడికి వచ్చి ఆద్యంతంఉండి వెళ్లాలన్నారు. సీఎం రాక నేపథ్యంలో జమ్ము (హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రదేశం) నుంచి నరసన్నపేట జూనియర్ కాలేజీ (సభా ప్రాంగణం) వరకూ సీఎంకు స్వాగతం చెప్పే విధంగా ఉంటే ఇంకా బాగుంటుందని అన్నారు.