ఏపీలో అమానుష ఘటన జరిగింది. తిరుపతి 100 పడకల మెటర్నిటీ ఆసుపత్రిలో ఇటీవల ప్రవసం కోసం వచ్చిన మహిళను ఆసుపత్రిలో చేర్చుకోలేదు. దీంతో ఆ మహిళ రోడ్డుపైనే బిడ్డను ప్రసవించింది. ఆ సమయంలో కొందరు ఆమె చుట్టూ బెడ్ షీట్లు పట్టుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే ఓ వ్యక్తి ఆమెకు ప్రసవం అయ్యేందుకు సహాయపడ్డాడు. ఆ మహిళకు తోడుగా ఎవరూ లేరనే కారణంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోలేదు. ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఆరోగ్యశాఖ ఇన్‌చార్జి శ్రీహరి స్పందించారు. ప్రసవం తర్వాత తల్లిని, బిడ్డను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.