కేరళలోని మలప్పురంలో ఇటీవల హనీట్రాప్ వ్యవహారం బయటపడింది. రషీదా, నిషాద్ భార్యాభర్తలు. యూట్యూబర్లుగా పేరు సంపాదించారు. దానిపై వచ్చే ఆదాయం సరిపోవడం లేదని 68 ఏళ్ల వృద్ధుడిని హనీట్రాప్ చేశారు. తనతో ఎంజాయ్ చేసేందుకు ఇంటికి రావాలని వృద్ధుడిని రషీదా ఏడాది క్రితం పిలిచింది. వచ్చాక అతడితో ఎఫైర్ పెట్టుకుని సీక్రెట్ కెమెరాతో వీడియో తీసింది. బ్లాక్మెయిల్ చేసి రూ.23 లక్షలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రషీదా, నిషాద్లను పోలీసులు అరెస్ట్ చేశారు.