పీఎం కిసాన్ పథకంలో అనర్హులను ఏరివేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. దీనికోసం పథకంలో 8 మార్పులను చేసింది. లబ్దిదారులంతా తమ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలని కోరింది. ఇందులో కూడా అనర్హులకు చోటు లేకుండా మార్పులు చేశారు. ఇప్పటి వరకు అక్రమంగా పొందిన వారు నగదును తిరిగి చెల్లించాలి. లేనిచో చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. కేంద్రం పీఎం కిసాన్ కింద సంవత్సరంలో మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేస్తుంది.